గూర్గావ్ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు గ్రూపు తన డీలర్ నెట్వర్క్ ద్వారా మాన్సూన్ సర్వీస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ క్యాంపెయిన్‌లో వర్షాకాల సీజన్‌కు గాను కార్ల భద్రతను, పనితీరును మెరుగుపరచడానికి మెయింటెయినెన్స్, అవసరమైన అప్గ్రేడ్లతో కారును పూర్తిగా సంసిద్ధంగా రూపొందించి ఇవ్వనున్నట్లు బిఎండబ్ల్యు గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా పేర్కొన్నారు.