హైదరాబాదు: ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెటింగ్ సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) దేశంలో 50 వేల మంది సభ్యులను అధిగమించింది. దేశవ్యాప్తంగా టైర్ 3, 4 నగరాల్లో చిన్న వ్యాపారాలను శక్తివంతంచేసేలా బీఎన్‌ఐ అద్భుతమైన చొరవతో పాటు.. ముఖ్యమైన ఈ మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో బీఎన్‌ఐ వ్యవస్థాపకులు, చీఫ్ విజన్ ఆఫీసర్ డాక్టర్ ఇవాన్ మిస్నర్ భారత్‌ను సందర్శించారు. ప్రపంచ మహమ్మారి సవాళ్ళను ఎదుర్కొంటున్న సమయంలోనూ బీఎన్‌ఐ భారతదేశంలో అసాధారణ వద్ధి కొనసాగినట్టు ఆయన చెప్పారు. 121 నగరాల్లోని 1080 చాప్టర్లలో 50,830 మంది సభ్యులతో బీఎన్‌ఐ దేశంలో తన ఉనికిని చాటుకున్నది. ఈ సందర్భంగా ‘ఆధునిక నెట్‌వర్కింగ్ పితామహుడు’ డాక్టర ఇవాన్ మాట్లాడుతూ… ‘బిఎన్‌ఐ మారిన తీరుచూసి నేను గర్విస్తున్నాను. వ్యాపార ప్రపంచం, వ్యక్తిగత జీవితాలపై దీని ప్రభావం కొనసాగుతూనే ఉంది. గివర్స్ గెయిన్ ఫిలాసఫీ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండటంపట్ల నేను గర్వపడుతున్నాను’ అన్నారు. 50,000 మంది సభ్యుల మార్కును అధిరోహించినందుకు బీఎన్‌ఐ ఇండియాను చూసి గర్వపడుతున్నానన్నారు. చిన్న వ్యాపారాల సామర్థ్యాన్ని వెలికితీయడం, సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా, బీఎన్‌ఐ స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడం మరియు దేశవ్యాప్తంగా అసంఖ్యాక పారిశ్రామికవేత్తల జీవితాలను మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.