బిఎన్ఆర్ కేఎస్ కొండపాక మండల అధ్యక్షులుగా జక్కుల కిషన్

నవ తెలంగాణ –  సిద్దిపేట

బి ఎన్ ఆర్ కే ఎస్ కొండపాక మండల అధ్యక్షులుగా జక్కుల కిషన్ ఎంపికైనట్లు సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బల శ్రీశైలం తెలిపారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో నియామక పత్రం అందించి, నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వ నుండి పథకాలను పొందడానికి అవకాశం ఉంటుందని, సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని అన్నారు. నూతన అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా కృషి చేస్తానని, జిల్లా,  రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. బిఎన్ఆర్కే ఎస్ కొండపాక మండల ప్రధాన కార్యదర్శిగా కాసరాజు, ఉపాధ్యక్షులుగా చిలుముల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా కనకరావు, నబీ పాషా, సెక్రటరీగా రామచంద్రం, కోశాధికారిగా యాద మల్లయ్య, ప్రచార కార్యదర్శిగా నరసయ్య, బాలకృష్ణ, సలహాదారులుగా బాలకృష్ణ, వేణు, శ్రీనివాస్, మల్లేశంలు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షుడు ఈర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.