వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే బీఓబి లక్ష్యం..

BOB aims to provide better services to customers.– ఘనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా  117వ వార్షికోత్సవ వేడుకలు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్‌ బరోడ పనిచేస్తుందని సూర్యాపేట బ్రాంచి మేనేజర్‌ శ్రీనివాస్ అన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరొడ 117వ వార్శికోత్సవ వేడుకల సందర్భంగా శనివారం స్టానిక బ్యాంకు ఆవరణలో కేక్ కట్‌ చేసి’వినియోగదారులకు బ్యాంకు అందీస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1908 జూలై 20 న ఆవిర్భావించిన బ్యాంకు 9,600ల బ్రాంచిలతో 24 లక్షల  కోట్ల వ్యాపారంతో అతి పెద్ద బ్యాంకుల్లో దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. వినియోగదారులకు డిజిటల్‌ సేవలతో పాటు లోన్‌లు, నిధుల పంపకం, రైతులకు గోల్డ్‌ లోన్‌లు అందించడంలో రాజీ లేకుండా పని చేస్తుందన్నారు. బిఓబి వరల్డ్‌ యాప్‌తో ఇంటి వద్దనే అన్ని రకాల సౌకర్యాలను అందిస్తుందన్నారు. డిపాజిట్‌ రేట్‌ సీనియర్‌లకు 7.90, మిగతావారికి 7.40 ఇస్తుందన్నారు. బ్యాంకులో పీఎం జన్‌ దన్‌ యోజన కింద సేవింగ్స్ అకౌంట్స్, జీరో ఎకౌంట్స్, కూడా అందిస్తున్నామన్నారు. బ్యాంకులో పీఎం సురక్ష, పీఎం జీవనజ్యోతి, అటల్ పెన్షన్ యోజన పథకాలు అందుబాటులో ఉన్నాయని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు గండూరి శంకర్, సింగిరి కొండ రవీందర్, సాత్విక్, బ్యాంక్ ఉద్యోగులు జాన్, మహేష్, రాకేష్, పవన్, హరీష్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.