హైదరాబాద్: ప్రముఖ అభరణాల రిటైల్ చెయిన్ పిసి జ్యువెలర్స్ సమర్పించిన వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఒటిఎస్) ప్రతిపాదనకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) తన ఆమోదాన్ని తెలిపిందని ప్రకటించింది. కంపెనీ బకాయిలు చెల్లించడానికి ఒటిఎస్‌ను ఎంచుకున్నట్లు స్పష్టం చేసింది. ఒటిఎస్ నిబంధనలు, షరతులు సెటిల్‌మెంట్ కింద చెల్లించవలసిన నగదు, ఈక్విటీ భాగాలకు అంగీకరించినట్లు పేర్కొంది. 14 బ్యాంక్‌ల నుంచి అప్పులు పొందిన పిసి జ్యువెలర్స్ ఆరు బ్యాంక్‌లో వన్ టైం సెటిల్‌మెంట్‌కు ఒప్పందాలు కుదర్చుకుంది.