హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 19 శాతం వృద్థితో రూ.4,579 కోట్ల నికర లాభాలు సాధించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 3.08 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే సమయం నాటికి జిఎన్‌పిఎ 4.53 శాతంగా, నికర ఎన్‌పిఎలు 0.99 శాతంగా ఉన్నాయి. కాగా.. 2023 డిసెంబర్ ముగింపు నాటికి బిఒబి నికర ఎన్‌పిఎలు 0.70 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 2.6 శాతం పెరిగి రూ.11,101 కోట్లకు చేరింది.