బొక్కోళ్ల (బొక్కోని) కుంట పునరుద్ధరణపనులు ప్రారంభం

– ‘నవతెలంగాణ’ కథనాలకు స్పందన
– నీటిపారుదల శాఖ ఏఈ సంతోష్‌కుమార్‌
నవతెలంగాణ-రామన్నపేట
రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామంలోని బొక్కొల (బొక్కోని) కుంటలో అనుమతులు లేకుండా 40 ఫీట్ల లోతు వరకు మట్టి తోడేసి ప్రమాదకరంగా మార్చిన కుంటపై నిబంధనలకు విరుద్ధంగా కుంటల మట్టిలూటీ, కుంటల్లో మట్టిని అక్రమంగా తోడేస్తున్నారనే శీర్షికలతో నవతెలంగాణ ఇటీవల ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు ఆదివారం కుంటల్లో మట్టిని తోడేసిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు.దీంతో కుంటలో తోడిన ప్రమాదకరగుంతలను పూడ్చడానికి ట్రాక్టర్లతో మట్టి తెచ్చి పూడ్చే పనిని ప్రారంభించారు. నీటిపారుదల శాఖ ఏఈ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ కుంటలోని గుంటలో మట్టితో నిప్పి పూర్వస్థితికి తీసుకొస్తామని తెలిపారు.చెరువు, కుంటలో అనుమతులు లేకుండా ఎవరు మట్టితోడిన, తరలించిన, అక్రమణకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.