బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఘనంగా సన్మానించిన తాడు బిలోలి ఆలయ కమిటీ చైర్మన్..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం తాడిబిలోలి ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ బోధన్ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ అమీర్ నో శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. నూతనంగా ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రావు ఆయన శాలువతో సన్మానించగా, తిరిగి చైర్మన్ కు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు భూమా రెడ్డికి ఆయన శాలువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఎండి మౌలానా, నరసయ్య, లింగారెడ్డి, మాజీ చైర్మన్ లింగాల అబ్బన్న, మల్ల సాయిలు, సింగిల్ విండో చైర్మన్ మొయినుద్దీన్, బాబు నాయక్, తదితరులు పాల్గొన్నారు.