
ఈ నెల 27 న జరిగే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి ని గెలిపించాలని బిఆర్ఎస్ యూత్ డిండి మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు పల్లి జయంత్ బుధవారం పట్టభద్రులను ఒక ప్రకటన లో కోరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ…నిరుద్యోగుల సమస్యలు శ్యాసన మండలిలో ప్రశ్నించే వ్యక్తి, విద్యావంతుడు, బిట్స్ పిలాని మేనేజ్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ లో డబుల్ పీజీ చేసిన వ్యక్తి ఏనుగుల రాకేష్ రెడ్డి అని బ్యాలెట్ పేపర్ లోని సీరయల్ నంబర్ 3 కు ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన పట్టభద్రులను కోరారు.