
రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ఉన్న వెంకటేశ్వర ఫర్టిలైజర్ దుకాణాన్ని బోధన్ రూరల్ సిఐ నరేష్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, స్థానిక ఎస్సై ఈ. సాయన్నలు తనిఖీలు నిర్వహించారు. ఫర్టిలైజర్ దుకాణాలలో కల్తీ విత్తనాలను అమ్మ రాదని, స్టాక్ రిజిస్టర్ లను వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైతులకు అందజేసిన ప్రతి మందులకు రిసిప్ట్ తప్పనిసరిగా ఇవ్వాలని ఫర్టిలైజర్ యజమాని శివకుమార్ ను ఆదేశించారు. స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు కనబడే విధంగా బోర్డుపై రాయాలని డీలర్లకు ఆదేశాలిచ్చారు.