బొడ్రాయి ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఆదివారం గ్రామదేవత బొడ్రాయి పోచమ్మ ఆంజనేయస్వామి వార్షికోత్సవ పూజలు అభిషేకాలు అర్చనలు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు ప్రతిష్టాచార్యులు తిరుక్కోవల్లూరు ఉదయ భాస్కర స్వామి  ఆధ్వర్యంలో నిర్వహించినారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దేవతామూర్తులకు జలాభిషేకం నిర్వహించారు. నిర్వహణ కమిటీ వారు ప్రజలకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.