వర్షాలు పడాలని బొడ్రాయికి పూజలు..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ ప్రజలు, రైతులు వర్షాలు కురవాలని ఆదివారం పూజలు చేశారు. కప్పను కర్రకు కట్టి గ్రామంలో ఊరేగింపుగా గ్రామదేవతలైన బొడ్రాయి, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మలకు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో రైతు మునగాల అమరేందర్ రెడ్డి కొంతం శ్రీను రెడ్డి, గంగనబోయిన నరసింహ, బొగ్గు అంజయ్య, పిసాటి ఉపేందర్ రెడ్డి, పల్లె రాజు, జిల్లాల పూలమ్మ, ఎన్నపల్లి మల్లమ్మ, సత్తమ్మ, సునిత, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.