అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

నవతెలంగాణ – లోకేశ్వరం
మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన సుంకరి సాయవ్వ(45) గత కొన్ని రోజులుగా మతి స్థిమితం కోల్పోయి ఈ నెల 6వ తేదీన శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బందువుల ఇళ్లలో గాలించిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో మృతురాలి చెల్లెలు అనురాధ ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సోమవారం గ్రామ చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. చెల్లెలు అనురాధ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అశోక్ పేర్కొన్నారు.