గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నవతెలంగాణ- నవీపేట్: పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ శివారు జగ్గారావు ఫారం గ్రామ సమీపంలో నిజాంసాగర్ కెనాల్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై యాదగిరి గౌడ్ బుధవారం తెలిపారు. మృతుడి వయస్సు 45 నుండి 50 వరకు ఉండవచ్చని అన్నారు. మల్కాపూర్ కార్యదర్శి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపట్టినచో పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు.