తెలంగాణ ఉద్యమకారులకు బోయినపల్లి స్మారక అవార్డు ప్రధానం 

నవతెలంగాణ-రామగిరి 
పద్మనాయక కల్యాన మండపంలో బోయినపల్లి వెంకట రామారావు 104 జయంతి సందర్భంగా హాజరైన మాజీ స్పీకర్ మధుసుదన చారీ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ, కవి గాయకుడు అందేశ్రీ హాజరయ్యారు బోయినపల్లి వెంకట రామారావు తనయుడు బోయినపల్లి హనుమంతరావు అధ్యర్యంలో జరిగిన ఈవేడుకల అనంతరం తెలంగాణ ఉద్యమకారులను శాలువలతో,  మెమోంటలతొ ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ప్రజాయుద్ధనౌక  గద్దర్ కు కూడా బోయినపల్లి రామారావు స్మారక అవార్డును అంకితం చేశారు.అలాగే తెలంగాణ ఉద్యమకారులను పొరం రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం,కరీంనగర్ జిల్లా అద్యక్షులు కనకం కుమారస్వామి తో పాటు తదితరులు పాల్గొన్నారు.