బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలో మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మైపాల్ ఆధ్వర్యంలో సోమవారం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మైపాల్, మాజీ జెడ్పిటిసి ప్రొద్దుటూరి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ల పోరం అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, నాయకులు మోర శ్రీనివాస్, బోడ సుధాకర్, గుర్రం శ్రీకాంత్, బొజ్జ రవి, గజ్జల హనుమంత్, భద్రయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.