
శంకరపట్నం మండల కేంద్రంలో శనివారం సీపీఐ జనరల్ బాడీ సమావేశం పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందజేస్తామన్నారు. రుణమాఫీ రానీ రైతులందరికీ రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆరు వారాలుగా ఉపాధి హామీ వేతనాలు చెల్లించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 25 తేదీలలో కరీంనగర్లో జరిగే రాజకీయ శిక్షణ తరగతులకు శంకరపట్నం మండలం నుండి ప్రతి గ్రామం నుండి కార్యదర్శులు ప్రజా సంఘల నాయకులు విధిగా హాజరు కావాలన్నారు. మన సమావేశల్లో తీసుకొన్న నిర్ణయాలు గ్రామాల్లో కూడా సమావేశాలు పెట్టుకుని గ్రామ శాఖ నిర్మాణం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని, ఇండ్లు ఇళ్ల స్థలాలు, పెన్షన్స్, రేషన్ కార్డులు,వెంటనే ఇవ్వాలన్నారు. పాలకులు ప్రపంచ బ్యాంకు సలహాలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అని పేరుతో ప్రభుత్వ నిధులను ప్రైవేట్ యాజమాన్యాలకు దార దత్తం చేస్తున్నాయన, రేపు రానున్న బడ్జెట్ ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో కన్నం సదానందం, పిట్టల తిరుపతి, జానపట్ల దేవయ్య,పిట్టల రామస్వామి,గోదారి లక్ష్మణ్, మేకల రవి, ఎస్ వెంకటయ్య, డి రాజు, జయరాజు, ఏ అరవిందు, పి సంపత్,వెంకటయ్య, సిహెచ్ రవీందర్, ఎండి బాదుల్ల,టి రవి, ఒదయ్య,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.