తెలంగాణోద్యమంలో బోయినిపల్లి పోరాటం..

– జెడ్పీటీసీ కనగండ్ల కవిత 
– దాచారంలో ఇంటింటా జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో బోయినిపల్లి వినోద్ కుమార్ పోరాటం ప్రత్యేకమైందని ఎంపీగా గెలిపించాలంటూ ప్రజలను జెడ్పీటీసీ కనగండ్ల కవిత విజ్ఞప్తి చేశారు. శనివారం మండల పరిధిలోని దాచారం గ్రామంలో బోయినిపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా జెడ్పీటీసీ కనగండ్ల కవిత స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కరపత్రాలతో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో గ్రామాధ్యక్షుడు ఏనుగుల ఐలయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దీటి రాజు, గుజ్జుల రామారావు, అమరగొండ రాజు, ఘనపురం తిరుపతి కార్యకర్తలు పాల్గొన్నారు.