‘నాకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోయిన్ అవ్వాలని ఉండేది. ‘ఇస్మార్ట్ శంకర్’కి ఆడిషన్ ఇచ్చాను. కానీ కుదరలేదు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే ‘డబుల్ ఇస్మార్ట్’లో అవకాశం రావడం మరింత హ్యాపీగా ఉంది. పూరి విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను’ అని కథానాయిక కావ్యాథాపర్ చెప్పారు. రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కావ్యా థాపర్ మీడియాతో ముచ్చటించింది.
‘రామ్, సంజరు దత్ లాంటి బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాలో నేనూ పార్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏదైనా సొంతగా నేర్చుకునే అమ్మాయి. చాలా స్మార్ట్. అదే సమయంలో తనలో ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది. ఇందులో నాకు ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. రామ్‌తో డ్యాన్స్ చేయడం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. తను చాలా ప్యాషనేట్ యాక్టర్. ఛార్మి నన్ను చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రస్తుతం గోపీచంద్‌తో ‘విశ్వం’ సినిమా చేస్తున్నాను.