నవతెలంగాణ – అశ్వారావుపేట:
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు శనివారం సాయంత్రం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని ఊట్లపల్లి పంచాయతీ పరిధిలోని గంగారంకు చెందిన మార్నేల బాలాజీ(22) అనే యువకుడు ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట కు వస్తున్న క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భద్రాచలం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో బాలాజీకి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు చిట్టితల్లి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేశారు. కుటుంబీకులు ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఎస్.హెచ్.ఒ 2 ఎస్సై శివరామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.