పార్లమెంట్ ఎన్నికలపై బిఓఎల్ఎఫ్ శిక్షణ

నవతెలంగాణ- డిండి: రాబోయే పార్లమెంట్ ఎన్నికల సంసిద్ధతలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోమండల స్థాయి బిఎల్ఓ లకు తహశీల్దార్ ఎన్. తిరుపతయ్య ఆధ్వర్యంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిక్షణకు మాస్టర్ ట్రైనర్స్  గొడుగు శ్రీనివాస్, పెనుగొండ శేఖర్, రేణికుట్ల రాజశేఖర్,  హాజరై బిఎల్ఓలకు ఓటర్ నమోదు ప్రక్రియ, ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు, తుది జాబితా తయారు చేయడం, ఓటర్ జాబితా తయారు చేయడంపై బూత్ లెవెల్ ఆఫీసర్స్ కు  శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల పరిధిలోని బిఎల్వోలు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో వచ్చే వివిధ  సమస్యలపై తగిన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక  ఇంచార్జ్ యంపీడీఓ డా నియల్, ఎలక్షన్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.