నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా కేతెపల్లి పిఎసిఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం లో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. డీసీఎంఎస్ చైర్మన్ గా ఎంపికైన బోళ్ల వెంకట్ రెడ్డికి శాలువా కప్పి కృత జ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ చాంబర్ వరకు తీసుకెళ్లి చైర్మన్ సీట్ లో కూర్చోబెట్టి ఎంపిక పత్రాన్ని అందజేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత కొంత కాలంగా వైస్ చైర్మన్ గా ఉన్న దుర్గంపూడి నారాయణరెడ్డి చైర్మన్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీసీఎంఎస్ లో ఉన్న డైరెక్టర్లందరూ ప్రస్తుతం కేతపల్లి పిఎసిఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బోళ్ల వెంకట్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకోవడంతో ఆయన నూతన చైర్మన్ గా నల్గొండ పట్టణం లోని డీసీఎం ఎస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు డైరెక్టర్లు నూతనంగా ఎంపికైన చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డికి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నల్గొండ డీసీ ఎంఎస్ పాలకవర్గంలో చైర్మన్ గా బోల్ల వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ గా దుర్గంపూడి నారాయణరెడ్డి, డైరెక్టర్లుగా గుడిపా టి సైదులు, ధనాపత్ జయరాం, దొంగర వెంకటేశ్వర్లు, నెల్లూరు ఉషారాణి, ఎస్. అనురాధ, కొండ సరిత, కర్నాటి లింగయ్య లు ఉన్నారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డిసిఓ, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళి, సిబ్బంది పాల్గొన్నా రు.