ఆది శ్రీనివాస్ నాయకత్వంలో బొల్లారం ముందడుగు..

Bollaram takes a step forward under the leadership of Adi Srinivas.– గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి కోటి 5 లక్షల రూపాయల మంజూరు పై హర్షం..
– ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబడిపోయిన వేములవాడ రూరల్ మండలం  బొల్లారం గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికైన తర్వాత అభివృద్ధిలో ముందంజలో ఉందని రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళలాభరణం శ్రీనివాస్  వ్యాఖ్యానించారు. గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి ఒక కోటి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళలాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ మండలానికి రెండు కోట్ల 25 లక్షల రూపాయలు మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వకుళబరణం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ సెక్రటరీ బాలసాని శ్రీనివాస్ గౌడ్, రూరల్ మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదిల్ పాషా, మాజీ ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దశరథం గౌడ్, సీనియర్ నాయకులు బుర్ర నారాయణ గౌడ్, సుద్దాల కైలాసం, పోతుగంటి రాములు, గుర్రం రామ చంద్రం, గొండ రఘుపతి, ఇట్టిరెడ్డి రణధీర్ రెడ్డి, మోకినపల్లి  బాబు, ఇరువాల మల్లేశం, ముర్గం అనిల్, సుద్దాల హేమంత్, లోకుర్తి మనీష్, గ్రామ  మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.