
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ- శశి సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు మంగళవారం ములుగు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లు రమేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని మంత్రి సీతక్కకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లు రమేష్ మాట్లాడుతూ పోరాటమే ఊపిరిగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిత్యం శ్రమించే మన మంత్రివర్యులు సీతక్క ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్ద పదవులు స్వీకరించి, రాష్ట్రంలో, ములుగు ఏజెన్సీలో సేవలందించాలని ఆకాంక్షించారు.