టీఎస్‌ఐఆర్‌డీలో మొక్క నాటిన బాలీవుడ్‌ నటి రాగేశ్వరి లూంబా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణకు హరితహారంలో భాగం గా గురువారం హైదరాబాద్‌లోని తెలం గాణ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(టీఎస్‌ఐఆర్‌డీ)లో బాలీవుడ్‌ ప్రముఖ గాయని, నటి రాగేశ్వరి లూంబా తన కుటుంబ సభ్యుల తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లూంబా మా ట్లాడుతూ.. తెలంగాణలో పచ్చదనం గణ నీయంగా పెరిగిందనీ గమనించానని తెలి పారు. హరితహారాన్ని నిరంతరం ఒక యజ్ఞంలా ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్‌ను ప్రత్యే కంగా అభినందించారు.పంచాయ తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, స్పెషల్‌ కమిషనర్లు వీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌, ఎస్‌వి ప్రదీప్‌ కుమార్‌ శెట్టి, జాయింట్‌ డైరెక్టర్‌ నరేంద్రనాథ్‌ రావు, ఎస్‌.వినోద్‌, ప్రత్యేక ఆహ్వానితులు రీతూ సుల్తానియా, సౌమ్య స్వరూప్‌, కుమారి వీర , కుమారి వేదిక, దేవాన్స్‌, అమిత్‌ షా, కపిల్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.