రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 20న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా రవితేజ మాట్లాడుతూ,”టైగర్ నాగేశ్వరరావు’తో హిందీలోకి రావడం ఆనందంగా ఉంది. హిందీకి నేనే డబ్బింగ్ చెప్పాను’ అని అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ,’రవితేజతో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు వంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా ప్యాషన్‌తో ఈ సినిమాని తీశాం’ అని తెలిపారు. ‘రవితేజ ఎంతగానో సపోర్ట్ చేశారు. అభిషేక్ చాలా గ్రాండ్‌గా ఈ సినిమా తీశారు. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా’ అని దర్శకుడు
వంశీ తెలిపారు.