– నాగ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండింగ్
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో అత్యవసరంగా సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానం టాయిలెట్‌లో ఈ బెదిరింపు లేఖ కన్పించింది. ఆదివారం ఉదయం 7.55 గంటలకు ఇండిగో విమానం జబల్‌పుర్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. దాదాపు 9 గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లోకి వెళ్లగా కమోడ్ సీటుపై ఒక పేపర్ కన్పించింది.