నవతెలంగాణ – బొమ్మలరామారం
రోడ్డుపై ఒక వ్యక్తి పోగొట్టుకున్న ఫోను పోలీసులు సీఈఐఆర్ యాప్ సహాయంతో రికవరీ చేసి మంగళవారం బాధితుడికి అందజేశారు. బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన సాయి కిరణ్ గత వారం రోజుల ముందు తన ఫోన్ ను పోగొట్టుకున్నాడు.బొమ్మలరామారం పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. సీఈఐఆర్ యాప్ తో లొకేషన్ ట్రాక్ చేశారు.ఫోన్ యొక్క ఆచూకీ తెలియజేసి బాధితుడికి రికవరీ చేసినట్టు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.సిబ్బంది జనార్ధన్, ఉదయ్, ఉన్నారు.