బొంపల్లి గ్రామాభివృద్ధికి సహకరిస్తలే…!

– బొంపల్లి గ్రామాభివృద్ధి పనులకు ఆటంకపరుస్తున్న ఉపసర్పంచ్‌
– సర్పంచ్‌ కోళ్ల సురేష్‌ ఆవేదన
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారని సర్పంచ్‌ కోళ్ల సురేష్‌ తెలిపారు. సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆటంక ప రుస్తూ, చేసిన పనులకు చెక్కులకు సంతకాలు చేయ కుండా ఉపసర్పంచ్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారని స మావేశం ఏర్పాటు చేశారన్నారు. సమావేశానికి హాజరైన వార్డు సభ్యులందరూ చెక్కులపై సంతకాలు చేయని ఉపసర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలనీ తీర్మానిం చారని తెలిపారు. గ్రామంలో బోనాల పండుగ దృష్టిలో ఉంచుకొని లైట్‌లు వేయాలని, హనుమాన్‌, మల్లన్న, మై సమ్మ దేవాలయాల దగ్గరలోగల గ్రామకంఠ ఖాళీ స్థలం ఎవరూ ఆక్రమించకుండా చూడాలని ఆ స్థలం దేవాల యానికే కేటాయించాలని నిర్ణయించారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శిరాము, వార్డుసభ్యులు చంద్రశేఖర్‌, గుడిసె అనంతమ్మ, చాకలి మంగమ్మ, బండకింది యాదగిరి, అనిత బాలరాజ్‌, కో ఆప్షన్‌ సభ్యులు పెంటయ్య, ముద్దం వెంకటయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకట్‌ రెడ్డి, స్కూల్‌ ఛైర్మెన్‌ అనంతయ్య, గ్రామస్తులు గుడిసె రాము, చాకలి భాస్కర్‌, కుర్వ రమేష్‌, ఆవగుంట యాదయ్య, చంద్రకాంటి శ్రీనివాస్‌, ఎన్కెపల్లి వెంకటయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.