క్షత్రియ మహిళల బోనాల సంబరాలు..

– నల్ల పోచమ్మకు నైవేద్యాలు
నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని క్షత్రియ మహిళ మండలికి చెందిన మహిళలు గ్రామ దేవతలకు మంగళవారం బోనాలతో ఊరేగింపుగా వెళ్లి జలాభిషేకం చేశారు.  పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరం నుంచి 80 మంది మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు. పెద్ద బజార్ లోనున్న ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. ఆ తర్వాత బోనాలతో ఊరేగింపుగా నల్ల పోచమ్మ తల్లి ఆలయం వరకు డప్పులు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. క్షత్రియ కులస్తులు పిల్లాపాపలతో సల్లంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు కురవాలని గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో మొక్కినారు. అనంతరం పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలందరూ సామూహిక భోజనాలు చేసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత ఖాందేష్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత, న్యాయవాది బొచ్కర్ వీణ, డీజే సులోచన, హజారి అనసూయ, గటడి స్వాతి, అల్జాపూర్ రాజ సులోచన, జెస్సు లలిత, సాత్ పుతే మంజుల, అల్జాపూర్ చంద్రకళ, డీజే యశోద, వైద్య కవిత, గుజరాతి శ్రీలక్ష్మి, డీజే లత, గుజరాతి గీత, దొండి సునీత, బొచ్కర్ ప్రమీల, పడాల్ మంజుల తదితరులు పాల్గొన్నారు.