ఆత్రేయ పాఠశాలలో బోనాల సంబరాలు

Bonala celebrations at Atreya Schoolనవతెలంగాణ –  ఆర్మూర్  

పట్టణంలో జర్నలిస్టు కాలనీ లోని ఆత్రేయ పాఠశాలలో మంగళవారం ఘనంగా ఆ షాడ మాస గ్రామదేవతల బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. చదువుతో పాటు ఆటపాటలు, సంసృతి సంప్రదాయాలు విద్యార్థులకు తెలియడం, వాతావరణ మార్పుల ద్వారా వచ్చే అంటువ్యాధుల నివారణకు ఈ పండుగలో వాడే వేప నిమ్మ లాంటి ప్రకృతి మూలికల ప్రాధాన్యత వివరిస్తూ, ప్రకృతి తోనే మానవ మనుగడ ముడిపడి ఉంది. కాబట్టి వన సంరక్షణ ప్రాధాన్యతను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మాధురి, ప్రిన్సిపాల్ నరేష్, ఉపాధ్యాయులు రాజేష్, వంశీ,విష్ణు, రాకేష్, ధనలక్ష్మి, స్వరూప, ప్రణిత, శివాని, రవళి, రజిత, భవాని, సాగరిక, నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.