క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బోనాల సంబరాలు

Bonala celebrations at Kshatriya Engineering Collegeనవతెలంగాణ – ఆర్మూర్ 
క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఘనంగా బోనాలు సంబరాలు జరగాయి. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఎంబీఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ బోనాల పండుగ యొక్క మూలాలు శివపురాణం నుండి వచ్చాయని వేల సంవత్సరాల క్రితం భరత భూమిలో ప్రజలు కరువు కాటకాలతో అలమటించినప్పుడు, అమ్మలు గన్న అమ్మ దేవిని పూజించి ఆమెను వేడుకొనగా కొన్ని నెలలపాటు ఏకబిగిన వర్షాలు కురిసాయని దానితో కరువు కాటకాలు నశించిపోయాయని అప్పుడు వారు పండించిన పంట నుండి కూరగాయలు పండ్లతో ఆహారం అనగా భోజనం తయారు చేసి అమ్మవారికి నివేదించినట్టుగా శివపురాణం తెలుపుతుందని ఆ వేడుకను వైదికంగా శాఖంబరి ఉత్సవంగాను జానపదంలో బోనాల పండుగగానూ జరుపుకుంటారని అన్నారు. తెలంగాణలో చలి బోనం వేడి బోనం అనే రెండు సందర్భాలు ఉంటాయని వేడి భిజ ఆషాడమాసంలో ఆహారం వేడిగా వండి గ్రామదేవతలకు వడ్డించి బోనాల వేడుక చేసుకుంటారని అదే ఫిబ్రవరి మార్చి నెలలో చలి భవనముగా చలువ పదార్థాలు సమర్పిస్తారని అన్నారు వేడి భోజనం లేదా బోనాల పండుగ ఇప్పటి వర్షాకాల చల్లటి వాతావరణాన్ని తద్వారా బ్యాక్టీరియా వైరస్ లు రాకుండా వేడి ఆహార పదార్థాల స్వీకరించడం ఆరోగ్యకరమని  అన్నారు.
ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ బోనాల పండుగలో మనము పూజించే దేవత కాళీమాతగాను కాళీమాత స్త్రీ శక్తికి నిదర్శమని దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని చెడును సంహరించే శక్తికి కాళీమాత నిదర్శనం అని అలాంటి కాలిని మహంకాళి అని ఉజ్జయిని మహంకాళి భోజనాలు లేదా బోనాలు మనము జరుపుకుంటామని మహిళలు నైతిక ధైర్యంతో శక్తిసామర్థ్యాలతో సమాజాన్ని ముందుకు నడపాలని అభిలాషించారు క్షత్రియ కళాశాల కోశాధికారి శ్రీ అల్జాపూర్ గంగాధర్ గారు మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణలో ఉమ్మడి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించుకుంటారని ఆషాడమాస భవనాలు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకుంటారని అన్నారు అని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ప్రపంచ ఖ్యాతిని గడిచాయని మన ప్రాంత ప్రజలు స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఈ వేడుక చేసుకుంటారని నారీ శక్తికి స్వరూపమని అన్నారు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి శ్రీ అల్జాపూర్ దేవేందర్ గారు మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి నిదర్శనమని ఈ వేడుక తెలంగాణ ప్రజల సాంప్రదాయాలు ప్రకృతికి కాలానికి చాలా దగ్గరగా ఉంటాయని సైన్స్ తో అనుబంధాన్ని కలిగి ఉంటాయని దేవి ప్రకృతికి నిదర్శనం అన్నారు ఏ పండుగైనా మనల్ని కలిపి ఉంచే విధంగా జాతీయత భావాన్ని సమైక్యత భావాన్ని పెంపొందించాలని కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఆషాడ మాసంలో ప్రకృతిని ప్రార్థించాలని కోరారు. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత వారు కడు పేదరిక కుటుంబం నుంచి వెలిసిన ఆణి ముత్యం అని, వృత్తి ధర్మం పట్ల గాని,దేశం పట్ల గానివ్వండి వారు మనందరికీ ఆదర్శం ,రోల్ మోడల్ అని వాఖ్యా నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్. సెక్రటరీ అల్జాపూర్ దేవందర్,అల్జాపూర్ గంగాధర్,ప్రిన్సిపాల్ ఆర్ కె పాండే మెంబర్స్, విద్యార్థినులు,విద్యార్థులు పాల్గొన్నారు.