పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ విద్యానగర్ కాలనీలో గల లోటస్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అంబిక పోహార్ మాట్లాడుతూ.. బోనాల పండుగ యొక్క విశిష్టతను చిన్నారులకు వివరించారు తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ అని అభివర్ణించారు. అనంతరం విద్యార్థులు పాఠశాలలో ఏర్పాటుచేసిన గ్రామ దేవతల చిత్ర పటాలకు బోనాలను సమర్పించి నృత్యాలు చేశారు. శివశక్తుల, పోతరాజు, అమ్మవారు వేషధారణ తో చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పల్లవి, అధ్యాయాలు రుచిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.