మండలకేంద్రంలోని శ్రీ మహాత్మా హై స్కూల్ యందు బోనాల పండుగ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో, శివసత్తులు, పోతరాజు వేషధారణలో అందరిని అలరించారు. స్కూల్ కరస్పాండెంట్ కుంట రమేష్ బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యతను గ్రామ దేవతల గురించి పిల్లలందరికీ చక్కగా వివరించారు. ప్రిన్సిపాల్ సరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగగా అభివర్ణించారు. ఈ యొక్క పండుగను అందరూ నిర్వహించుకోవాలని తెలిపారు, పండుగ విశిష్టత గురించి పిల్లలకు తెలియజేశారు. విద్యార్థులు చేపట్టిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు రంజింప చేశాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దయాకర్, ఐత రాజు, సరిత, అనిత, పద్మ, లావణ్య, శమీమ్ ఇతరులు పాల్గొన్నారు.