పట్టణంలో పలు పాఠశాలల్లో బోనాల సంబరాలు

Bonala celebrations in many schools in the townనవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణంలో గల జెంటిల్ కిడ్స్, స్మైల్, శ్రీ చైతన్య పాఠశాల ల  యందు బోనాల పండుగ శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు శివసత్తులు, పోతరాజు వేషధారణలో అందరిని అలరించారు. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లతా బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యతన గ్రామ దేవతల గురించి పిల్లలందరికీ చక్కగా వివరించారు.  కరెస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతి మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పండుగగా అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహించుకోవాలని తెలిపారు, పండుగ విశిష్టత గురించి పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేశారు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
స్మైల్ పాఠశాల యందు..
స్మైల్ పాఠశాలలో ఈరోజు స్మైల్స్ ద స్కూల్ ప్రాంగణంలో బోనాలు పండగ నిర్వహించారు . పిల్లలందరూ సాంప్రదాయంగా  దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకున్నారు పాఠశాల నుండి ఉపాధ్యాయులు విద్యార్థులు బోనాల ఎత్తుకొని ఐదు చేతుల పోచమ్మ వద్దకు వెళ్లారు దేవతకు బోనాలను సమర్పించారు .పాఠశాల కరస్పాండెంట్ షబానా గౌహర్ ,స్టాఫ్ సరిత, సవిత, సింధూర, సింధుజ ,స్వప్న ,శ్వేత రోజా శ్రావణి స్వప్న పాల్గొన్నారు. డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ మన సాంప్రదాయం బోనాలు గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో సైతం బోనాల సంబరాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.