జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల పండగ 

Bonala festival in Zilla Parishad High Schoolనవతెలంగాణ – కంఠేశ్వర్ 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్రాద్ లో ప్రధానోపాధ్యాయులు సురేష్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రంగులతో అలంకరించిన బోనాలను తయారుచేసి పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతి మాతకు నైవేద్యం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ పండగ బోనాలు యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అంతేకాకుండా పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు మన సాంస్కృతి సాంప్రదాయాలు తెలపడం వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలు పెరుగుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు డ్రాయింగ్ టీచర్ తరల రమేష్, ఉపాధ్యాయులు మమత, జలజ, గంగాధర్ రమేష్, సాయన్న నీరజ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.