
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని కుబీర్ మండలం పల్సి గ్రామంలోని విద్యా భారతి ప్రవైట్ పాఠశాలలో శనివారం ఆషాఢమాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు,విద్యార్థినిలు బోనాలను నెత్తిన ఎత్తుకొని అమ్మావారికి బోనాల నైవేద్యం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు,ఆనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు,పోతారాజుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి,ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ గంగా సింగ్ మాట్లాడుతూ..తెలంగాణ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని,ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు,అదే విదంగా రైతులు వేసిన పంటలకు వర్షాలు బాగా కురిసి వారు వేసిన పంటలు సమృద్ధిగా పండలని,ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి వేడుకున్నారు. బోనాల ఉత్సవాలు పట్టణంలోని కాకుండా పల్లెల్లోనే ,విదేశాల్లో సైతం వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు,ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పోతన్న, ఉపాధ్యాయులు రామకృష్ణ, మధుసూదన్, సాయినాథ్ , భోజన్న, రాజు, ప్రవీణ్, రాజు, దేవకి, కవిత , శ్రావణి, సరోజన, గంగామణి, సరస్వతి, వైష్ణవి, రాణి, అస్మిత, నేహ, విద్యార్థీని,విద్యార్థులు,పాల్గొన్నారు.