నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్నేహ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్, హెచ్ఐవి నివారణ కార్యక్రమం, ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నేహ సొసైటీ జిల్లాలో హెచ్ఐవి, ఎయిడ్స్ నివారణకు కృషి చేస్తుందని దానిలో భాగంగా మహిళ సెక్స్ వర్కర్స్, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్ లతో పని చేస్తూ ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుందని అంటువ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని అమ్మవారి ఆశీర్వాదాలు ప్రజలపై ఉండాలని కోరుతూ కోణాలు తీయడం జరుగుతుందని ఈ బోనాల ఊరేగింపు మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ నుండి గౌతమ్ నగర్ లోని మైసమ్మ గుడి వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ బోనాలను ట్రాన్స్ జెండర్లు వంశీ ప్రియ, రక్షా, సుచిత్ర, శివసత్తులో నరహరి, హర్షిత్, మహతి లు బోనాలు ఎత్తి ఊరేగింపుగా వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్దయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, ప్రోగ్రాం మేనేజర్ మొహిజ్ అహ్మద్, ఎం ఎస్ ఈ విజయ్, జి ఎన్ ఎం మౌనిక, కౌన్సిలర్ అన్విత, అవుట్ రిచ్ వర్కర్లు, మహిళా సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు పాల్గొన్నారు. వీరితోపాటు మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులు సిబ్బంది, అందుల పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.