తెలంగాణ సంస్కృతి బోనాల పండుగ.. 

– బోనాలు సాంప్రదాయానికి చిహ్నాలు 
– మాజీ స్పీకర్ పోచారం, ఆగ్రో చైర్మన్ కాసుల 
నవతెలంగాణ – బాన్సువాడ, నసురుల్లబాద్ 
తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయం బోనాల పండుగని, ప్రజలంతా బోనాల పండుగను సంతోషంగా జరుపుకుంటాని మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్  అన్నారు. ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా గురువారం బాన్సువాడ పట్టణంలో ప్రభుత్వ మాత, శిశు కేంద్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో బోనాల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బోనాలు ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పండగ బోనాల పండుగని ఆయన అన్నారు. రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ మనుషుల ఆరోగ్యాలను, పంటలను, నీటి చెరువు కట్టలను , రక్షణగా నిలుస్తూ, కష్టాలలో సుఖాలలో తమకు అండగా నిలబడే ప్రకృతి దేవతలను తరతరాలుగా కొలుస్తూ వస్తున్నామని, తెలంగాణ ఉత్సవాల్లో బోనాల పండుగ ప్రముఖమైందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్ సొసైటీ చైర్మన్ లు కృష్ణారెడ్డి, శ్రీధర్, వైద్యులు వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.