మహిళలంతా ఒకే యూనిఫాంలో బోనాల పండుగ

– పాల్గొన్న మున్నూరు కాపు ముద్దుబిడ్డ డాక్టర్ విజయ్
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు కొన్ని మున్నూరు కాపు బేడలు బోనాల పండుగను అంగరంగ వైభోగంగా ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల పండుగకు ఒక బేడలోని మహిళలు యూనిఫామ్ డ్రెస్సులతో బోనాలు ఎత్తుకొని నైవేద్యాలు ఎత్తుకొని గ్రామదేవతలకు సమర్పించారు. ఇదే బేడ నుండి మద్నూరు మండల కేంద్ర మున్నూరు కాపు ముద్దుబిడ్డ పశువైద్య డాక్టర్ విజయ్ పాల్గొనడం విశేషం బోనాల పండుగకు మున్నూరు కాపు ముద్దుబిడ్డ డాక్టర్ విజయ్ సలహాలు సూచనల మేరకు మహిళలకు ప్రత్యేకంగా యూనిఫామ్ ధరించడం ఈ బేడలో ప్రత్యేకత బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.