అల్పోర్స్ హై స్కూల్ పాఠశాలలో బోనాల ఉత్సవాలు 

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని అల్పోర్స్ హై స్కూల్ పాఠశాలలో సోమవారం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ వి నరేందర్ రెడ్డి బోనాల ఉత్సవాలలో పాల్గొని శ్రీ దుర్గా మాత చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో  ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మతాలకతీతంగా అట్టహాసంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో  శాంతిభద్రతలను పరిరక్షించడమే కాకుండా మతసామరస్యాన్ని పెంపొందించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఆషాడ మాసం రాగానే రాష్ట్ర రాజధాని హైదరాబాద్  లో బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా సపరివార సమేతంగా అందరు పాల్గొని మన దేవతల ఆశీస్సులు పొందుతారని అన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులలో వేషధారణలు వేశారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.