స్నేహ సొసైటీలో బోనాల జాతర..

నవతెలంగాణ-కంఠేశ్వర్

నగరంలోని మారుతినగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్ స్ట్రక్షన్ ఆధ్వర్యంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్నేహ టార్గెటెడ్ ఇంటర్నేషనల్ ( ఎయిడ్స్ నివారణ కార్యక్రమం) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐటి ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ .సిద్దయ్య హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహ ఐటి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగను నిర్వహిస్తున్నామని, అమ్మవారికి బోనాల సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలను సుఖసంతోషాలతో ఉండే విధంగా దీవించాలని కోరారు. రాష్ట్ర ప్రజలను అతివ`ష్టి, అనావ`ష్టిల భారి నుంచి కాపాడాలని, ప్రజలను అంటురోగాల నుంచి కాపాడి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని బోనాలు తీశారు. ఈ బోనాలు శివపత్తులు, మహిళా సెక్స్ వర్కర్లు, జోగినిలు ఊరేగింపుగా మారుతినగర్ లోని స్నేహ సొసైటీ నుంచి బంగారు మైసమ్మ కాలనీలో బంగారు మైసమ్మ గుడి వరకు బోనాలు తీశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ షేక్ మోయిజ్ అహ్మద్, ప్రిన్సిపాద్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, మహిళా సెక్స్ వర్కర్లు, ఔట్ రిచ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.