
మండలంలోని బషీరాబాద్ లో మల్లన్న స్వామి జాతర ఉత్సవాలలో భాగంగా సోమవారం స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా బోనాలను ఆలయం వద్దకు తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించారు. బోనాల ఊరేగింపు సందర్భంగా మహిళలు మంగళ హారతులు పట్టారు.అనంతరం ఆలయం వద్ద స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు, గ్రామ ప్రజలకు పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమములో యాదవ సంఘం అధ్యక్షులు గణేష్, కార్యదర్శి దేవన్న, రాజు, అబ్బాస్, ముకేష్, గంగాధర్, మహేష్, చిన్నయ్య, నడ్పెన్న , రామక్రిష్ణ, ఆశన్న, భూమన్న, రాజు, అబ్బాస్, సాగర్, ముత్యం, చరణ్, దిలీప్, మహంత్, మల్లన్న స్వామి దీక్ష స్వాములు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.