కమ్మర్ పల్లి లో బోనాల ఊరేగింపు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రజక సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని ఊర చెరువు వద్ద నూతనంగా నిర్మించిన  మడేలేశ్వర స్వామి  ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ముగింపు ఉత్సవాల్లో భాగంగా గ్రామం నుండి చెరువు వద్ద మడేలేశ్వర స్వామి ఆలయం వరకు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపు సందర్భంగా బోనాలు ఎత్తుకున్న మహిళలు రోడ్డు వెంట నడిచేటప్పుడు రజకుల ఆచారం ప్రకారం రజక సంఘం సభ్యులు రోడ్డుపైన చీరలను పరిచారు. అనంతరం ఆలయంలో మడేలేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు  తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు.  ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రజక సంఘం అధ్యక్షులు ఆవుట్ల బాజన్న, సుంకేట నరసయ్య, సుంకేట శ్రీనివాస్, సుంకేట రమేష్, రజక సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.