ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులో గల గ్రామదేవతలకు ఆర్యవైశ్య సంఘం మహిళలు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకుని, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం గ్రామ శివారులో గల పెద్దమ్మ ఆలయం వద్ద వనభోజనాలు నిర్వహించారు.