బోనాలు తెలంగాణ ప్రత్యేక సంస్కృతికి ప్రతిబింబం

– ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బోనాలు పండుగ తెలంగాణ ప్రత్యేక సంస్కృతికి, జీవన వైవిధ్యానికి ప్రతిబింబమని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, ప్రశాంతత, అభివృద్ధినివ్వాలని ఆమె ఎల్లమ్మ దేవతను ప్రార్థించారు.