– మున్నూరు కాపు బోనాల మహోత్సవంలో చల్మెడ..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని పడమటి మున్నూరు కాపు సంఘం బోనాలు శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి – రాజు ఆధ్వర్యంలో శ్రీ బద్ది పోచమ్మ కు బోనాలను సమర్పించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై బోనాల మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పాడిపంటలు సమృద్ధిగా పండి, పంటలు సకాలంలో వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బోనాల మహోత్సవంలో మునిసిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి నెత్తిన బోనం ఎత్తుకొని ఊరేగింపుగా తరలి వెళ్లారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, వేములవాడ పట్టణ కౌన్సిలర్లు , సీనియర్ నాయకులు మాదాడి గజానంద రావు, వాసాల శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.