బద్దిపోచమ్మకు బోనాలు..

Baddipochamma's bonas..నవతెలంగాణ – వేములవాడ
కోరిన కోరికలు తీర్చే తల్లి వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం శ్రీరాజరాజేశ్వరస్వామివారి ని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ.  మంగళవారం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకుని తరించారు. దేవాలయంలో పట్నాలు, కల్లు శాఖ, ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.