బంధాలు..భావోద్వేగాలు

Bonds..emotionsఅలీ రజా, సీతా నారాయణన్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌ షిప్‌’ అనేది ఉపశీర్షిక. ఎన్‌.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఈనెల 26న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిత్ర ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ ఈవెంట్‌కు నిర్మాతలు ప్రసన్నకుమార్‌, లయన్‌ సాయి వెంకట్‌, రామకష్ణ గౌడ్‌, రామసత్య నారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎన్‌.లక్ష్మీ నందా మాట్లాడుతూ, ‘పుట్టిన ఊరికి ఏదైన చేయాలని కోరుకున్న వారంతా ముందుకు వచ్చి నా ఈవెంట్‌ను సక్సెస్‌ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు. ‘ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్‌. నా మీద నమ్మకంతో నాకు ఈ చిత్రాన్ని ఇచ్చారు. ఇందులో ‘ఉయ్యాల జంపాల, శతమానంభవతి’ ఫ్లేవర్‌ నాకు కనిపించింది. మా ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ బ్యానర్‌ మీద ఏడాదికి ఆరు చిత్రాలైనా రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతీ చిన్న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నా. లక్ష్మీ నందాతో ఓ సోలో చిత్రాన్ని చేస్తున్నాను’ అని సింగులూరి మోహన్‌కష్ణ చెప్పారు. నిర్మాత మువ్వా సత్యనారాయణ మాట్లాడుతూ, ‘సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రాన్ని చాలా ఎంజారు చేస్తూ నిర్మించాం. ఈ మూవీ పెద్ద సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నాం’ అని తెలిపారు.