నవతెలంగాణ రంగారెడ్డి ప్రతినిధి : సంక్రాంతి పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సీతారాంపేటలో ఘనంగా నిర్వహించారు. ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోనం రాజు రవి కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బోగి మంటలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ రాగానే తెలుగు ఇండ్లలో కొత్త శోభ వస్తుందన్నారు. ముగ్గులు వేసి భోగి మంటలు వేసి, కోడిపందాలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు. మూడు రోజులపాటు కోలాహాలంగా జరిగే సంక్రాంతి వేడుకలు జరుగుతాయని తెలిపారు. మొదటిరోజు సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణ యానం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తుంటాడని, ఈ సమయంలో చలి ఎక్కువవుతుందన్నారు. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు మొదలవుతాయన్నారు. భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పండుగ మొదలవుతుందన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగం జరుపుకోవాలని ద్రోణం రాజు రవికుమార్ తెలిపారు.